London:ప్రిన్స్ పట్టాభిషేకం.. 10 వరుసల తర్వాత హ్యారీ

70
- Advertisement -

బ్రిటన్ రాజకుటుంబికుల మధ్య దూరం మరింత పెరిగింది. గతేడాది క్వీన్ ఎలిజబెత్2 మరణం తర్వాత… కింగ్ చార్లెస్ రాజుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ… సంప్రదాయంగా నిర్వహించే వేడుకలు మాత్రం ఇంకా జరగలేదు. అవి మే 6న జరగనుంది. ఈ వేడుక కోసం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబే ముస్తాబవుతుంది. అయితే రాచరిక విధులను వదులుకొని అమెరికాలో నివసిస్తున్న ప్రిన్స్ హ్యారీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు రాజకుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Also Read: జలుబు నివారణకు చిట్కాలు..

అయితే ఈ కార్యక్రమంలో ఆయన రాజకుటుంబానికి 10వరుసల ఆవల కూర్చుంటారని ప్రకటించినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనం. వారి మధ్య రాజీకి అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు విండ్సర్స్‌ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని నేను భావిస్తున్నాను. అయితే తన తండ్రి కోరిక మేరకు హ్యారీ ఆ వేడుకకు హాజరవుతున్నాడు అని తెలిపారు. అయితే మూడు రోజులు జరిగే పట్టాభిషేక కార్యక్రమాలకు కేవలం పట్టాభిషేకం సమయంలో మాత్రమే ఉంటారని, కేవలం 24గంటల్లో యూకే నుంచి వెళ్లిపోతారని తెలిపారు.

Also Read: వాటే క్రియేటివిటీ..వెరైటీ వెడ్డింగ్ కార్డు!

- Advertisement -