భారత్‌…రెమిటెన్స్‌ వృద్ధిలో టాప్‌

277
- Advertisement -

భారతదేశం నుంచి వలసవెళ్లి భారత్‌కు పంపిస్తున్న విదేశి నిధులు సూమారుగా 100బిలియన్ల్‌ డాలర్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు ప్రచురించిన నివేదిక వెల్లడించింది.  ఇది గత సంవత్సరం కంటే 7.5శాతం వృద్ది పెరిగిందని తెలిపింది. తరువాతి స్థానాల్లో మెక్సిక్‌ ($60), చైనా ($51), ఫిలిప్పీన్స్‌($38) ఈజిప్ట్‌($32), పాకిస్తాన్($29) రెమిటెన్స్ వృద్ది(బిలియన్‌ డాలర్ల) ఉందని నివేదికలో పేర్కొంది.

గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాల్లో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం భారత్‌కు చెందిన కార్మికులు వలసలు వెళ్లడం వలన ఈ రాబడులు పెరిగాయని అంచనా వేసింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాల వల్ల  ప్రభావం ఉందని పేర్కొంది. తక్కువ నైపుణ్యం నుంచి అధిక నైపుణ్యం కలిగిన దేశాలకు కూడా భారత కార్మికులు వలస వెళ్తున్నారని పేర్కొంది.

యూఎస్‌ యూకే లాంటి దేశాల్లో భారత్, చైనాలోని యువకులు ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. భారతదేశం నుండి వలస వచ్చిన వారిలో 20 శాతం మంది యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ఉన్నారు. యూఎస్‌ జనాభా లెక్కల ప్రకారం, 2019లో యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న సుమారు 5 మిలియన్ల మంది భారతీయులు అత్యధిక నైపుణ్యం కలిగి ఉన్నారని పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్‌లో 43 శాతం మంది భారతీయ సంతతి నివాసితులు ఉండగా వారందరూ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు.

కరోనా కారణంగా ఇళ్ల నుండి పనులు చేయడం, భారీ ఉద్దీపన ప్యాకేజీలు, సేవలకు సంబంధించిన చెల్లింపులో వృద్దిని వేగవంతం చేయడం తదితర కారణాల వల్ల భారీగా మార్పులు జరిగినవి పేర్కొంది. మహమ్మారి అనంతర వేతన పెంపుదల రికార్డు స్థాయిలో ఉపాధి పరిస్థితులు, అధిక ద్రవ్యోల్భణం నేపథ్యంలో రెమిటెన్స్ వృద్దికి మద్దతు ఇచ్చాయని తన నివేదికలో వెల్లడించింది.

తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు కరోనా తర్వాత ఐదు జీసీసీ (సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్ మరియు ఖతార్) దేశాల్లో పనులను ప్రారంభించారు. దీంతో మునపటి కంటే మెరుగైన చెల్లింపులు, అధిక చమురు ధరలు కార్మికుల డిమాండ్‌ను పెంచయాని పేర్కొంది.

భారతదేశంలో త్వరతిగతిన టీకాలు వేయడం, ప్రయాణాన్ని పునఃప్రారంభించడం లాంటి చర్యల వల్ల 2021లో కంటే 2022లో ఎక్కువ మంది వలసదారులు ఉపాధిని పొందారని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రభావం చేత భారత్‌కు 30శాతం వాటా చెల్లింపులు జీసీసీ దేశాల నుంచి లభించిందని నివేదికల్లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి…

ఇదే సరైన సమయం:హరీశ్‌ రావత్‌

బీ-21… ఆరోతరం యుద్ధ విమానం

బంగారానికి పెరిగిన డిమాండ్..

- Advertisement -