చిట్టికి మహేష్ ఫిదా..థ్యాంక్స్ చెప్పిన శంకర్

312
mahesh
- Advertisement -

తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 2.0 . సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు కాసింత ఊరట కలిగేలా వినాయకచవితి సందర్భంగా సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ చిత్ర ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. తెరపై చిట్టి చేయ‌బోవు సంద‌డి చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నాం. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌ చిత్ర బృందానికి నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు మ‌హేష్‌.

మహేష్‌ నుంచి ఉహించని రెస్పాన్స్ వచ్చినందుకు ఉబ్బితబ్బైపోయింది చిత్రయూనిట్. మహేష్‌కు అక్ష‌య్ ధ‌న్య‌వాదాలు తెలుప‌గా, శంక‌ర్ కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తూ మ‌హేష్‌, ఆయ‌న ఫ్యామిలీకి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.

గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కిన సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టీజర్‌లో శంకర్‌ మార్క్‌ స్పష్టంగా చూపించాడు. ఒక్కసారిగా ఫోన్లన్నీ మాయమైపోవడం,అక్షయ్ కుమార్ ఎంట్రీ అదిరిపోయింది. చంద్రముఖి సినిమాలో ‘లకలక’ అంటూ ఆకట్టుకున్న రజినీ… ఈ సినిమాలో ‘కుక్కురు’ అంటూ తనదైనశైలిలో పలుకుతూ కేక పుట్టించారు.

550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం 3డీ, 2డీ ఫార్మాట్స్ లో విడుద‌ల కానుంది.

- Advertisement -