- Advertisement -
యూ ట్యూబ్ ప్రముఖ వ్యాఖ్యాత, ఫిల్మ్ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) ఇటీవల కరోనా కారణంగా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీఎన్‌ఆర్ ఆకస్మిక మృతి పట్ల ప్రైమ్ షో ఎంటర్‌టైన్ మెంట్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. తమ వంతు ఆర్థిక సహాయంగా లక్షరూపాయలను ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధుల మాట్లాడుతూ – ‘‘టీఎన్‌ఆర్ మృతిచెందారనే దుర్వార్త మమ్మల్ని ఎంతగానో కలచి వేసింది. చాలా బాధపడుతున్నాము. ఈ దురదృష్టకర సంఘటనను మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. టీఎన్‌ఆర్ మృతికి ప్రగాఢ సాను భూతిని తెలియజేస్తూ, మా వంతుగా వారి కుంటుంబనికి ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాం. టీఎన్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు.
- Advertisement -