టీఎన్‌ఆర్ కుటుంబానికి అండగా మెగాస్టార్..

55
chiru

కరోనాతో ఇటీవల మృతిచెందిన నటుడు,జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ కుటుంబానికి అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా లక్ష రూపాయాల సాయం అందజేశారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన చిరు..ఆయన భార్య పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు.

టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.