ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి: నిరంజన్ రెడ్డి

144
minister
- Advertisement -

సేంద్రీయ ఎరువుల వినియోగం (సిటీ కంపోస్ట్ ) పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు , రాంకీ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ ఎండీ గౌతం రెడ్డి , భవాని ఆర్గానిక్స్ ఎండీ రమేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి….ప్రజలకు నాణ్యమైన ఆహారం అందడమే లక్ష్యంగా పనిచేయాలి…అగ్రోస్ సంస్థ సిటీ కాంపోస్ట్ సేంద్రీయ ఎరువును రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలన్నారు. రసాయనిక మందులు, ఎరువుల మూలంగా ప్రజలకు స్వచ్చమైన ఆహారం అందడం లేదని .. క్రమేనా సేంద్రీయ ఉత్పత్తుల వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారని చెప్పారు.

కూరగాయలు, పండ్లు అన్నింటిలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి…పూర్వం ఈ రసాయనాలు లేని ఆహారం మూలంగా మన తల్లిదండ్రుల తరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుదీర్ఘకాలం జీవించారని… రాబోయే తరాలకు నాణ్యమైన ఆహారం అందించడం మన బాధ్యత అన్నారు. సిటీ కంపోస్ట్ ఎరువు మీద ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఇది అధిక కర్భన శాతం కలిగిన సేంద్రీయ ఎరువు .. భూమికి ఎక్కువ కర్భన పదార్థం అవసరం అన్నారు.

నేల ఆరోగ్యాన్ని ఇది ఘణనీయంగా పెంచుతుంది…మొక్కల వేరు ఎదుగుదలకు తోడ్పడడంతో పాటు నేలకు నీరును పట్టి ఉంచే సామర్ధ్యం పెంచుతుందన్నారు. దీనివల్ల పంటల ఉత్పాదకత పెరుగుతుంది….. ఇతర సేంద్రీయ ఎరువులైన వర్మికంపోస్ట్, పచ్చి రొట్ట, పశువుల ఎరువులతో పాటు ఈ సేంద్రీయ ఎరువును (సిటీ కంపోస్ట్)వాడితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో దీనిని ఉపయోగించి ప్రమోషన్ నిర్వహించాలి .. దీనికి సంబంధించి ఆయా శాఖల అధికారుల సహకారం తీసుకోవాలన్నారు.

రైతులకు ఈ సేంద్రీయ ఎరువుపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి .. శిక్షణా శిబిరాలలో ఒక అంశంగా బోధించాలి … రైతులకు ఈ ఎరువు ప్రాధాన్యత తెలిస్తే ఆదరణ లభిస్తుందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి… ఇటువంటి సేంద్రీయ ఎరువులకు ఇచ్చే రూ.1500 సబ్సిడీ అందేలా ప్రయత్నించాలన్నారు. క్రిబ్ కో, కోరమాండల్ వంటి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మూలంగా అగ్రోస్ కన్నా తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నారన్నారు. పెద్ద రైతులకు ప్యాకింగ్ లేకుండా నేరుగా పంపించడం మూలంగా సంస్థకు ప్యాకింగ్ ఖర్చు, రైతుకు బస్తాలను అన్ లోడ్ చేసే ఖర్చు తగ్గుతుందన్నారు. ఉద్యాన రైతులను ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.

- Advertisement -