అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసు నమోదు..

42
cp anjani kumar

తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు లాక్ డౌన్ మొదలు కాగా ఏపీ- తెలంగాణ బోర్డర్ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్‌ ఉన్న నేపథ్యంలో అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

రవీంద్రభారతి, అబిడ్స్, నాంపల్లి, ఎం జె మార్కెట్, మధీన, చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ ..నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామన్నారు. జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది…. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌, ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో అధికారులతో కలిసి పర్యవేక్షించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.