స్వయం, స్వయంప్రభ డిజిటల్‌ చానళ్ల ప్రారంభం

200
President Pranab launches digital initiatives in education sector
President Pranab launches digital initiatives in education sector
- Advertisement -

నాణ్యమైన బోధన, అభ్యసన ప్రక్రియ ఉన్నత విద్యకు హృదయం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వంటిదని అభివర్ణించారు. ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన స్వయం, స్వయంప్రభ డిజిటల్‌ చానళ్లు ప్రారంభించారు. నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ వెబ్‌ పోర్టల్‌ (nad.gov.in)ను ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడారు. ఉన్నత విద్యా సంస్థల్లో బోధన, అభ్యసన ప్రక్రియల్లో నాణ్యత పెంచాలని రాష్ట్రపతి అన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థ ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం, నూతన విజ్ఞాన సృజన స్ఫూర్తి రగిలించాలన్నారు.

సాంకేతికత, ఇంటర్నెట్‌ విస్తరణ వల్ల విద్యా వనరులు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. డిజిటల్‌ సాంకేతికత ద్వారా తరగతి గదికి రాలేని విద్యార్థులు నేరుగా అత్యుత్తమ గురువుల పాఠాలు వినే అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపగ్రహాల వినియోగం వల్ల విద్యకు దూరమైన వారికి చదువుకొనే అవకాశం దక్కుతుందని నిరూపణ అయిందని ప్రణబ్‌ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ పాల్గొన్నారు.

మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేయనున్న ప్రణబ్‌ను పార్లమెంట్ ఉభయసభలు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా ఈ నెల 23న పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు సభను ఏర్పాటు చేశాయి.2012, జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీబాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ, బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. గతంలో ప్రణబ్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇక తదుపరి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -