ముఖంపై చెరగని చిరునవ్వుతో అమాయకంగా కనిపిస్తూ ఎందరినో ఆకట్టుకున్నాడు ఉదయ్ కిరణ్… ‘చిత్రం’గా వెండితెరపై వెలిగి అనతికాలంలోనే మాయమయ్యాడు. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు మూడేండ్లు గడిచాయి. అతని మరణ విషాదం ప్రతీ ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల ఉదయ్ కిరణ్ స్మారకంగా నిర్వహించిన కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా దయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమేనని, ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, బాధలో ఉన్న వారిని ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు ఉదయ్ కిరణ్ అని, అర్థాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు చిరంజీవి కుటుంబమే కారణమనే విమర్శలు కూడా అప్పట్లో చెలరేగాయి. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాలను బయటపెట్టారు.

చిన్నప్పటి నుంచి అందరిలాగానే ఉదయ్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఉదయ్ కు చాలా ఇష్టమన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. ఉదయ్ కు చిరంజీవి చాలా సహకారం అందించారన్నారు. అంతేకాదు చిరంజీవి తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారని, గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారని.. అయితే, నిశ్చితార్థం తర్వాత ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని… ఇద్దరి ఆలోచనలు కలవడం లేదనే అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. పెళ్లి రద్దు చేసుకుందామనే నిర్ణయాన్ని ఉదయ్ కిరణే తీసుకున్నాడని చెప్పారు.

ఈ క్రమంలో ఉదయ్ తో కలసి ఒకసారి చిరంజీవి ఇంటికి వెళ్లానని… ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అద్భుతమని అన్నారు. అలాంటి వ్యక్తి ఉదయ్ కెరీర్ నాశనం చేశాడన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ తరువాత నిషితతో వివాహం జరిగిందని.. కానీ వాళ్లు ఆనందంగా ఉండలేకపోయారంది. ఉదయ్ తన వివాహానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు తనతో చెప్పేవాడు కాదని.. కేవలం డబ్బు సమస్య గురించి మాత్రమే తమతో చెప్పుకునేవాడని శ్రీదేవి చెప్పుకొచ్చింది.. చనిపోయేముందు రోజు తనతో పది నిమిషాలు మాట్లాడాడు. అప్పుడు చాలా ప్రశాంతంగా మాట్లాడాడు.. పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ వీడియోలో చూడండి..

