రాజుగారి గదిలో కాజల్‌ ఏం చేసింది..?

229
- Advertisement -

తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది కాజల్ . ఖైదీ 150 సినిమా ముందు కాజల్ ఏమి అంతా బిజీగా లేదనే చెప్పాలి.. హిందిలో ఒకటి తమిళ్లో ఒకటి చేసుకుంటూ ఉంది. ఖైదీతో మళ్ళీ కాజల్ పూర్తి బిజీ హీరోయిన్ అయ్యింది. అవకాశాలు ఇంకా తగ్గుతున్నాయి అన్న సమయంలో మెగాస్టార్ మూవీలో తమిళ్ స్టార్ హీరో సినిమాలలో అవకాశం పట్టేసింది.

Kajal as Heroine for Nagarjuna

అయితే ఇప్పుడు మరో తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. నాగార్జున హీరోగా నటిస్తున్న రాజు గారి గది2 సినిమాలో ఒక కెమియో రోల్ చేస్తోందట అమ్మడు. అయితే పాత్ర ఏంటి అది ఎలా ఉండబోతుంది అనేది గోప్యంగా ఉంచుతున్నారు. దీని కోసం ఒక పది రోజులు షూటింగ్ కూడా చేసింది అని తెలుస్తుంది. రాజు గారి గది 2 హారర్ కామెడీ శైలిలో ఉండబోతుంది. ఈ సినిమాలో నాగార్జున తో పాటుగా వెన్నెల కిశోర్ ,ప్రవీణ్ కూడా నటిస్తున్నారు. సమంతా – సీరత్ కపూర్ మరో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాజల్ ఎంట్రీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు.

అంతే కాదు కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన సినిమా నేనే రాజు నేనే మంత్రి విడుదల కోసం ఎదురుచూస్తుంది. రానా తో కాజల్ కెమిస్త్రీ ఇప్పటికే మంచి హాట్ టాపిక్ అయ్యింది. సినిమా కూడా కొత్తగా ఉండబోతుందిని షూట్ మొదలుపెట్టినప్పటి నుండి చెబుతూనే ఉన్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే లో కూడా కాజల్ నటిస్తోంది.

- Advertisement -