ఆదివారం ముచ్చింతలకు రాష్ట్రపతి కోవింద్..

62
ramnath kovind
- Advertisement -

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 13న(ఆదివారం) హైదరాబాద్ రానున్నారు.నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయగా సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. దీంతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం రామానుజచార్యుల విగ్రహాన్ని సందర్శించారు.

ఇక ఇవాళ సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి..ఉపదేశం ఇవ్వనున్నారు. రేపటితో సహాస్రాబ్దిఉత్సవాలు ముగియనున్నాయి.

- Advertisement -