కేంద్రం నియంత్రణలోకి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్‌..

162
prakash
- Advertisement -

సమాచార ప్రసార శాఖ నియంత్రణలోకి డిజిటల్ కంటెంట్‌ని తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి చేయగా ఎవరుపడితే వారు యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టేందుకు వీలు లేదని తెలిపింది కేంద్రం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో ఇకపై డిజిటల్ మీడియా, ఆన్ లైన్ కంటెంట్‌పై కేంద్రం నిఘా ఉండనుంది.

బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. కంటెంట్‌పై అభ్యంతరాలుంటే సమాచార శాఖకు తెలిపే అవకాశం కల్పించింది. అంతేగాదు న్యూస్ ఛానల్స్‌కు వర్తించే నిబంధనలు సోషల్ మీడియాకు వర్తించనున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పరిధిలో న్యూస్‌ పోర్టల్స్‌తోపాటు యూ ట్యూబ్‌, హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తదితర స్ట్రీమింగ్‌ సర్వీసుల సంస్థలు వస్తాయని తెలిపింది కేంద్రం.

- Advertisement -