ఐపీఎల్-11 సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ రెండు జట్లు వరుస విజయాలు నమోదు చేస్తూ.. పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు టీమ్స్ ఈ సీజన్ నుంచి నిష్ర్కమించగా.. మిగతా నాలుగు టీమ్స్ చాంపియన్‌గా నిలిచేందుకు నువ్వా నేనా అన్నట్టు పోటీకి సిద్దంగా ఉన్నాయి. నేడు సన్రైజర్ప్ హైదరాబాద్-చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా.. నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టనుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది.
ఐపీఎల్-11 రేస్ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతిజింటా తన ఫేవరేట్ టీం చెన్నై అంటుంది. నేను ధోనికి పెద్ద అభిమానిని అని, ఖచ్చితంగా చెన్నై టీమ్ ఈ సారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలుస్తుందని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ధోని అంటే ప్రత్యేక అభిమానం అంటూ అభిమానులతో చెప్పుకొచ్చింది. అయితే ఈ సీజన్లో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోవడం విశేషం.
మొదటి నుంచి వరుస విజయాలతో దూసుకొచ్చిన పంజాబ్, తర్వాత వరుస ఓటములతో ఇంటిముఖం పట్టింది. ఈ లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఆరు మ్యాచ్ లలో విజయం సాధించి, 8 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. మరోవైపు ఉత్కంఠ భరితంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మెరవనుందా..? లేక చెన్నై గర్జించనుందా చూడాలి ఇక.