TTD:పాతవిధానంలోనే అన్నప్రసాదం

32
- Advertisement -

టీటీడీ అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈవో ధర్మారెడ్డి. టీటీడీ అన్న ప్రసాదాలకు, ఇతర అవసరాలకు 2013 నుంచి 2019 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుండి నాణ్యమైన సోనా మసూర బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు ఈవో. 2019లో పాలకమండలి నిర్ణయం మేరకు టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు.

Also Read:పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

అన్న ప్రసాదాలను మరింత రుచికరంగా అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్లు వారం రోజుల్లో బియ్యం సరఫరా రేటు తెలియజేస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం టెండర్ ద్వారా వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కేజి బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు.

వేద విశ్వవిద్యాలయంలో నడుస్తున్న మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టుకు జాతీయ మ్యాన్ స్క్రిప్ట్ మిషన్ తో అవగాహన ఉందన్నారు ధర్మారెడ్డి. తాళపత్ర గ్రంధాలను భద్రపరచడం, గ్రంథీ కరణ చేయడం లాంటి పనుల్లో వారి సహకారం తీసుకోవాలని చెప్పారు. స్కాన్ చేసిన తాళపత్రాలన్నీ సర్వర్ లో నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఇకపై ఈ ప్రాజెక్టుకు డైరెక్టరుగా వ్యవహరిస్తారని ఈవో చెప్పారు.

Also Read:వివేకా హత్య.. 25నే తుది తీర్పు !

- Advertisement -