మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రయాణం

162
Pranab Mukherjee
- Advertisement -

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉదయం 9గం.లకు ఆర్మీ హాస్పిటల్ నుంచి రాజాజి మార్గ్ లో ఉన్న ప్రణబ్ ప్రభుత్వ నివాసానికి పార్థీవదేహం తరలించారు. ఉదయం 9:30గం.లకు రక్షణ శాఖ అధికారులు, రక్షణ మంత్రి సందర్శన కోసం ఉంచగా 10 గంటలకు ప్రధానమంత్రి అనంతరం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సందర్శించి నివాళులు అర్పించనున్నారు.

ఆ తదుపరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర నాయకుల సందర్శన ఉండనుండగా ఉదయం 11గం.ల నుంచి 12 గం.ల వరకు సామాన్య ప్రజలకు సందర్శించి నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించారు..12గం.ల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం.. ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర …మధ్యాహ్నం 2 గం.లకు లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -