మహేశ్‌ మూవీ నుంచి తప్పుకున్న జగపతిబాబు..!

259
prakash raj

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా లేడి అమితాబ్ విజయశాంతి కీలకపాత్రలో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమాలో జగపతి బాబు,రాజేంద్రప్రసాద్ వంటి వారు కీలకపాత్రలో నటిస్తుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. మహేశ్ మూవీ నుంచి జగపతిబాబు తప్పుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. జగపతిబాబు స్థానంలో ప్రకాశ్‌ రాజ్‌ని తీసుకుందట చిత్రయూనిట్.

ప్రస్తుతం కాశ్మీర్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈసినిమాలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా పూర్తయ్యాక మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు మహేశ్. గీత గోవిందం దర్శకుడు పరుశరాములుతో తర్వాతి సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు.