”హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంది” అని విలక్షన నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. శనివారం మండ్యాలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పై విరుచుకుపడ్డారు .
బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తనని ఏదో ఒకటి చెయ్యటం మాత్రం ఖాయమని, ఈ మధ్యే కలబురగిలో బీజేపీ నేతలు తనపై దాడికి యత్నించారని చెప్పుకొచ్చారు. తన కారుపై రాళ్లు రువ్వారని, ఇప్పుడే ఇలా ఉంటే..అధికారంలోకి వచ్చాక నన్ను వదిలేస్తారా .? అన్నారు. ప్రశ్నించడమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుందని పేర్కొన్నారు.
కాగా భారత్ ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతికేకిస్తానన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.