జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్స్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాశ్ రాజ్. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
పవన్ మాట్లాడుతూ అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
దీనికి కౌంటర్‌గా స్పందించారు ప్రకాశ్ రాజ్. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ పంచ్ లు ఇచ్చాడు.
“మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please…
#justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025
Also Read:గాలి మాటలు..గబ్బు కూతలు: రేవంత్‌పైకేటీఆర్ ఫైర్