- Advertisement -
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరింది బీఆర్ఎస్ శాసనసభా పక్షం. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి వివరణ కానీ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది అన్నారు.
స్పీకర్ అంటే తమకు గౌరవం ఉందని.. సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్ శాసనసభా పక్షం.
Also Read:గాలి మాటలు..గబ్బు కూతలు: రేవంత్‌పైకేటీఆర్ ఫైర్
- Advertisement -

