అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

19
- Advertisement -

నేను జాతీయ సమస్యల గురించి మాట్లాడితే అవన్ని నీకెందుకు అని చాలామంది నవ్వారు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్.. ఎక్కడో ఏదో జరిగితే మనకు ఎందుకులే అని చాలా మంది అనుకుంటారు కానీ దేశ సరిహద్దుల భద్రత సరిగ్గా లేకపోతే వాటి ప్రకంపనలు ఎక్కడికైనా వెళ్తాయి .. అందుకే నేను దేశం కోసం, దేశ భద్రత కోసం ఇంత తపన పడతాను అన్నారు.

కొందరు కాంగ్రెస్ నేతలు పాక్‌ని ప్రేమిస్తున్నామని చెబుతున్నారని.. అలాంటి వాళ్లు దేశం విడిచి వెళ్లాలని ఫైర్ అయ్యారు. ఇక ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.

మత ప్రాతిపదిక జరిగిన దాడిని కూడా కాంగ్రెస్ నేతలు ఖండించలేకపోతున్నారని ….టెర్రరిస్టులు షికారుకు వచ్చినట్లుగా వచ్చి హిందువులను అత్యంత దారుణంగా కాల్చి చంపారని చెప్పారు.

Also Read:ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి:సీతక్క

- Advertisement -