ప్రభాస్ – వైజయంతీ మూవీస్ అప్‌డేట్

40
nag ashwin

సాహో తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. ఆయన సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్‌ వచ్చిన ఫ్యాన్స్‌కి పండగలా మారగా తాజాగా ప్రభాస్ -వైజయంతీ మూవీస్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ సినిమా చేయనుండగా విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో సోషియో ఫాంటసీగా ఈ సినిమా రానుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుందని…. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుందన్నారు. గ్రాఫిక్స్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కినట్లు అశ్వినీదత్‌ తెలిపారు.

ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించనున్నారు. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సంక్రాంతికి వస్తుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది.