ప్రభాస్ కి ఈ రిస్క్ అవసరమా?

40
- Advertisement -

ప్రభాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటుంది. దర్శకుడు మారుతితో సినిమా చేయడం అంటే.. నేషనల్ స్టార్ గా ప్రభాస్ తనకున్న ఇమేజ్ ను రిస్క్ లో పెట్టడమే. అయినా, ప్రభాస్ రిస్క్ చేసి మరీ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు. అసలు, ఛాన్స్ ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. కేవలం సినిమా బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ప్రభాస్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకపోయినా.. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడట. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గానూ వచ్చే లాభాల్లో ప్రభాస్ 40 శాతం వాటా తీసుకోనున్నాడు. మరోపక్క ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. నో డౌట్.. మారుతి మంచి దర్శకుడే. పైగా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. కానీ, మారుతి కి పరిధులు ఉన్నాయి. లోకల్ కంటెంట్ కు అలవాటు పడ్డ మారుతి.. ఉన్నట్టు ఉండి నేషనల్ వైడ్ గా అలరించాలంటే.. కష్టమే కదా.

మారుతి పై ఇదే అనుమానం ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా ఉంది. కానీ, ప్రభాస్ మాత్రం దైర్యంగా ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. కాకపోతే, దర్శకుడు మారుతి కి పాన్ ఇండియా సినిమా పూర్తిగా కొత్త. కాబట్టి, మారుతి పై కచ్చితంగా ఈ సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. అలాంటి ఒత్తిడిలో ఉన్న మారుతి ని నమ్ముకుని.. ప్రభాస్ ఏ న‌మ్మ‌కంతో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడో ప్రభాస్ కే తెలియాలి.

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి18..రావణాసుర ప్యార్‌లోన పాగల్

వీక్ కలెక్షన్స్ తో ‘అమిగోస్’

మిస్టర్‌ కింగ్‌..అంతా చూడాల్సిన చిత్రం

- Advertisement -