ప్రభాస్‌ కొత్త మూవీ టైటిల్‌ ఫిక్స్‌ ?

502
Prabhas And Sujith Movie Title As Sahoo
- Advertisement -

 దాదాపు నాలుగేళ్ళు బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవలే బాహుబలి సినిమా చిత్ర షూటింగ్ కి గుడ్ బై చెప్పాడు. ఇప్పటి నుండి సంవత్సరానికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందకు వస్తానని మాటిచ్చాడు. ఈ నేపథ్యంలో తదుపరి నటించాల్సిన సినిమాకు సిద్ధమౌతున్నాడు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న సినిమా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే తన లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు ప్రభాస్.
Prabhas And Sujith Movie Title As Sahoo -
త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులకూ ఫుల్‌ జోష్‌ ఇచ్చేలా ఉంది.  సుజీత్- ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు తెరకెక్కించనుండగా, తాజాగా ఫిలిం ఛాంబర్ లో ‘సాహో’ అనే టైటిల్ ని వారు రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ టైటిల్ ప్రభాస్ మూవీకే అని అంటున్నారు. అందుకు కారణం బాహుబలి2 చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో సాహో అనే ట్రాక్ తో విడుదల చేయగా సాహో అనే పేరు అందరికి దగ్గరైంది. దీంతో ఆ టైటిల్ అయితేనే ప్రభాస్ సినిమాకి బాగుంటుందని యూనిట్ భావిస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నారు.

- Advertisement -