ప్రభాస్ ఆదిపురుష్‌..ఆసక్తికర అప్‌డేట్‌

133
adipurush

సాహో తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు ప్రభాస్‌. ప్రస్తుతం రాధే శ్యామ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ యంగ్ రెబల్ స్టార్ తన తర్వాతి ప్రాజెక్టు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. పీరియాడికట్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌తో ఆదిపురుష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైఫ్ అలీఖాన్ వంటి నటులు కీరోల్ పోషిస్తుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ 2021లో ప్రారంభమవుతుందని చిత్రయూనిట్ తెలిపింది. 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పోస్టర్‌లో ఏ అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్ ను ను సహా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఉంచారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.