20వేల థియేటర్లలో ప్రభాస్ ఆదిపురుష్!

74
prabhas
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. ఆగస్టు 11న “ఆదిపురుష్‌” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ మూవీని జపనీస్ మరియు చైనీస్‌తో సహా అనేక విదేశీ భాషలతో పాటు బహుళ భారతీయ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్‌గా 15 భాషల్లో [దేశీయ + అంతర్జాతీయ] విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా 20,000 స్క్రీన్లలో విడుదల కానుంది.

ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -