చైతుతో మరోసారి రొమాన్స్‌ చేయనున్న పూజా..!

452
Pooja Hegde
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా రాణిస్తోంది. ఆ మ‌ధ్య మ‌హ‌ర్షి, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రాల‌లో నటించిన ఈ అమ్మ‌డు రీసెంట్‌గా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్‌తో, హిందీలో స‌ల్మాన్ ఖాన్‌తో న‌టిస్తుంది.

Rashmika Mandanna

తాజాగా పూజా ఖాతాలో మ‌రో ఆఫ‌ర్ చేరిన‌ట్టు తెలుస్తుంది. గీతా గోవిందం ఫేం ప‌ర‌శురాం.. నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ బేన‌ర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో ర‌ష్మిక‌ మందనని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం చైతూ స‌ర‌స‌న పూజానే ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో పూజా హెగ్డేకి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్టు టాక్. చైతు గతంలో పూజా హెగ్డే తో ‘ఓ లైలా కోసం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. త్వరలోనే హీరోయిన్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -