పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి..

170
minister satyavathi
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

బిడ్డ పుట్టినప్పటి నుంచే ఆరోగ్యంగా ఉండాలని.. గర్భిణిగా ఉన్న 6 నెలల నుంచి ప్రసించిన తర్వాత మూడో నెలవరకు ప్రతి నెల రూ.2000 చొప్పున 6 నెలలకు రూ.12 వేలు ప్రభుత్వం ఇస్తున్నదని వెల్లడించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీలు, బాలింతలకు అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే పాడి పంటలు మాత్రమేకాదని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అని సీఎం కేసీఆర్‌ ఆరోగ్యరంగం పట్ల అత్యంత శ్రద్ద తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -