డ్రగ్స్ కేసులో నోటీసులు.. హీరో తనీష్‌ క్లారిటీ..

264
Tanish Drug Case
- Advertisement -

టాలీవుడ్‌లో డ్రగ్స్ భూతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు. వారిలో హీరో తనీష్‌ కూడా ఉన్నాడు. తాజాగా తనీష్‌కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. బెంగళూరుకు చెందిన ఓ నిర్మాత తన కార్యాలయంలో పార్టీలు ఎక్కువగా ఇస్తున్నట్టు విచారణలో తేలింది. ఆ పార్టీలకు హాజరయ్యే ప్రముఖులలో తనీష్‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారని.. దీంతో, తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారని తెలుస్తోంది.

దీనిపై హీరో తనీష్‌ స్పందించారు. బెంగ‌ళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ త‌నీష్‌పై ప‌లు టీవీ చానెళ్లు క‌థ‌నాలు ప్రచారం చేయ‌‌డాన్ని ఆయన ఖండించారు. డ్రగ్స్‌ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్రచారం చేశారు. ఇందులో నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు క‌నీసం న‌న్ను సంప్రదించలేదు. నా కుటుంబాన్ని ఆ వార్తలు తీవ్రంగా బాధించాయి“ అంటూ త‌నీష్‌ తెలిపారు. బెంగ‌ళూరు నిర్మాత‌కు డ్రగ్స్‌ కేసులో నోటీసులు వ‌చ్చిన మాట నిజం. నాకు నోటీసు వ‌చ్చింది. కానీ నాకు వ‌చ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అస‌లు బెంగ‌ళూరు నిర్మాత‌తో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు లేవు అని తెలిపారు.

ఈ కేసులో నాకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరు. ఫలానా వివ‌రాలు మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి! అని మాత్రమే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాన‌ని నోటీస్ పంప‌లేదు. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్రచారం చేయొద్దు. కొన్ని మీడియాలు న‌న్ను సంప్రదించి న్యాయ‌బ‌ద్ధంగా నిజాల్ని ప్రచురించాయని త‌నీష్ తెలిపారు. బెంగ‌ళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గ‌తంలో సంప్రదించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయ‌న‌తో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవ‌కాశాల కోసం ఎంద‌రినో క‌లుస్తుంటాం. అభ్యర్థిస్తుంటాం. కానీ, ఆయ‌న‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. అని త‌నీష్ ఓ వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు.

- Advertisement -