టాలీవుడ్ కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సంచలనం విషయాలు భయటపడుతున్నాయి. ఈ మద్య డ్రగ్స్, కోకైన్‌లతో భారీ ఎత్తున నైజిరియన్లు పట్టుపడుతున్నారు.. వారిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ దందాలో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్టు వెల్లడైందని సమాచారం.. ఇప్పటికే కొందరు రిపోర్టర్లు ఉన్న విషయం భయటకు రాగా.. ఇప్పుడు పోలీసులకు కూడా డ్రగ్స్ మరక అంటుకునేలా ఉంది.. పోలీసులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ దందాకు రక్షణగా ఉన్నట్టు తెలిసింది.. అంతేకాదు వీరు పబ్బుల మాటున జరిగే డ్రగ్స్ దందాను భయటకు రాకుండా చూసినట్టు సిట్ ఛీఫ్ అకున్ సభార్వాల్ భావిస్తున్నారు..
ఈ కోణంలో కూడా సిట్ విచారిస్తున్నట్టు సమాచారం.. సీఎం కేసీఆర్ కూడా అకున్ కి ఈ మేరకు అధికారాలు ఇచ్చినట్టు తెలిసింది.. ఈ కేసులో ఎవరున్నా.. ఎంతటి వారున్నా.. వదలద్దొని.. దోషులకు శిక్ష పడాల్సిందేనని సీఎం స్పష్టం చేశారని సమాచారం. ఈ విషయమై డీజీపీ అనురాగ్ శర్మకి కూడా సమాచారం అందించారు.. ఒకవేళ విచారణలో దోషులుగా తేలితే.. పోలీసు అధికారులు సస్పెండ్‌కు గురికాక తప్పదు.. నయీమ్ కేసులో ఇన్వాల్వ్ అయినా కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్టే… ఈ కేసులో కూడా అదే పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది..