అంధుల పాఠశాలలో రామన్న బర్త్ డే

318
Ktr Birthday celebrations
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పురపాలక ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ పిలుపు మేరకు ఆయన అభిమానులు,టీఆర్ఎస్ కార్యకర్తలు హరితహారం కార్యక్రమంలో పాల్గొంటు మొక్కలు నాటారు. పలు ప్రాంతాల్లో రోగులకు పాలు,పండ్లు అందజేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్‌ నాయకులు ఆలయాలు,మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో కేటీఆర్ ను విష్ చేస్తున్నారు.

Ktr Birthday celebrations
సికింద్రాబాద్ దేవనార్ అంధుల పాఠశాలలోరామన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, వరికోలు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ న్యూస్ ఎండీ సంతోష్  పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు . అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

Ktr Birthday celebrations
కేటీఆర్ జన్మదినం సందర్భంగా.. పాఠశాల అభివృద్ధికి సంతోష్‌కుమార్, బాల్క సుమన్, శ్రీనివాస్‌రెడ్డి తలో రూ. 2 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. రూ. 6 లక్షలను పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు.

Ktr Birthday celebrations Ktr Birthday celebrations

- Advertisement -