ఈ అమ్మాయిలు బైక్‌పై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో

301
women bike stunt
- Advertisement -

అబ్బాయిల‌కు ఏమాత్రం తీసిపోమని ఈ ఇద్దరు అమ్మాయిల నిరూపించారు. బైక్‌పై విన్యాసాలు చేస్తూ ఈ అమ్మాయిలు జనాల దృష్టిని ఆకర్శించారు. అయితే, వారు ప్ర‌జ‌లు న‌డిచే రోడ్ల‌పై ప్రమాద‌క‌ర‌రీతిలో, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విన్యాసాలు చేయ‌డంతో అధికారులు జరిమానా విధించారు. అసలు విషయానికొస్తే.. శివంగి దబాస్ అనే అమ్మాయి సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. బైక్‌ల‌పై ఆమె చేసే విన్యాసాల‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతుంటారు.

అయితే, ఆమె ఇటీవల ఓ బైక్ విన్యాసాన్ని చేసి ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. రెజ్లర్‌ స్నేహ రఘువన్షితో కలిసి ఈ స్టంట్ చేసింది. రెజ్లర్ స్నేహ బైక్ న‌డుపుతుండ‌గా ఆమె భుజాలపై శివంగి కూర్చొని ఉండడం గ‌మ‌నార్హం. ఈ దెబ్బ‌కు త‌న ఫాలోవ‌ర్ల సంఖ్య పెరుగుతుంద‌ని, మ‌రింత ప‌బ్లిసిటీ వ‌స్తుం‌ద‌ని భావించింది. అయితే ఆమె అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అధికారులు శివంగికి ఊహించని షాక్‌ ఇచ్చారు.

ఈ వీడియో ట్రాఫిక్‌ పోలీసుల కంట్లో పడింది. ఈ అమ్మాయిలు ట్రాఫిక్‌ నియమ నిబంధనల్ని అతిక్రమించినందుకు రెజ్లర్‌ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11 వేలు చలానా పంపారు. అంతేకాదు, వారికి బైక్‌ ఇచ్చిన సంజయ్‌ కుమార్‌ అనే యజమానికి రూ.17 వేల జరిమానా విధించారు.

- Advertisement -