పుల్లారెడ్డి స్వీట్స్ మనవడుపై గృహ హింస కేసు..

12

తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ పేరు తెలియనివారుండరు. పుల్లారెడ్డి స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగువారికి ఎంతో ప్రీతికరంగా మారింది. పుల్లారెడ్డి మరణనంతరం ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.తాజాగా వీరి కుటుంబంలో కలకలం రేగింది. రాఘవరెడ్డి కుమారుడు ఎక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు.

పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం.. ఎక్ నాథ్ రెడ్డి భార్య తండ్రితో కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను హింసిస్తున్నట్లు సమాచారం. కాగా ఎక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు ఆమె ఉన్న రూమ్‌లో రాత్రికి రాత్రే ఒక అడ్డు గోడను నిర్మాణం చేశాడు. అతను ఇంటికి తాళం వేసి పారిపోయాడు అని ఎక్ నాథ్ భార్య తన పిర్యాదులో పేర్కొంది. దింతో బాధితురాలి పిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.