- Advertisement -
కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించి సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.
- Advertisement -