వచ్చే ఏడాది జరిగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం నరేంద్ర మోడీ సరికొత్త ప్రణాళికతో రెడీ అవుతున్నారా ? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవునేమో అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు మాదే అని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికి.. పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్ గా లేరనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఒకవైపు మణిపూర్ లాంటి అంశాలు మోడీ సర్కార్ పై వ్యతిరేకత పెరిగేలా చేస్తుంటే మరోవైపు విపక్షాలన్నీ ఏకం అయ్యి మోడీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు చేస్తున్నాయి. ..
ఇంత ప్రతికూల పరిస్థితులు ఉండడంతో నరేంద్ర మోడీ ప్లాన్ బి అమలుకు సిద్దమౌతున్నారనే టాక్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏమిటంటే ముందుస్తు ఎన్నికలకు వెళ్ళడం.. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లోనూ అలాగే వచ్చే ఏడాది మరో నాలుగు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం సత్తా చాటలేక పోయిన ఆ ప్రభావం వచ్చే ఏడాది జరిగే మరో నాలుగు రాష్ట్రాలపై అలాగే పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగానే ప్రభావం చూపుతుంది.
అందుకే వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఈఏడాది జరిగేలాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు టాక్. ఇంకా ఏపీతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే మరో మూడు రాష్ట్రాలను ఎన్నికలను కూడా ఈ ఏడాది డిసెంబర్ లో నిర్వహించేలా చర్యలు చేపట్టి వాటితో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏకకాలంలో జరిగిస్తే బీజేపీకి కలిసొస్తుందనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. మరి ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేపట్టలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. మరి ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరుకు సహకరిస్తాయో చూడాలి.
Also Read:కాంగ్రెస్ ఒడితే.. రేవంత్ రెడ్డి జంప్?