వైద్యులందరికీ ధన్యవాదాలు- ప్రధాని మోదీ

128
pm modi
- Advertisement -

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైద్యులు చేసిన సేవలు అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. వారి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా.. కరోనాను ఎదుర్కొనే క్రమంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని ప్రధాని తెలిపారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవ చేశారని ప్రశంసించారు. దేశంలోని వైద్యులందరికీ ధన్యవాదాలు ప్రకటిస్తు.. వైద్య రంగం కోసం రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు మోదీ చెప్పారు.

కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం దోహదపడిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకోవడానికి డిజిలీకర్, కోవిడ్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు వంటి యాప్ లను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామని తెలిపారు. మన దేశం అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని అన్నారు.

కో-విన్ ఫ్టాట్ ఫామ్ ను అనుసరించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ సెక్యూరిటీపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో మన దేశానికి పదో ర్యాంక్ వచ్చిందని తెలిపారు. భారత్ లో డేటా ప్రైవసీ పెరిగిందని చెప్పారు. విద్య నుంచి మందుల వరకు అన్నీ ఆన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైరస్ రకరకాలుగా మ్యూటేట్ అవుతున్నా… వైద్యుల అవగాహన కూడా పెరుగుతోంది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కంటే భారత్ వైరస్‌తో చాలా వేగంగా పోరాటం సలిపిందని, ఇతర దేశాల పాజిటివిటీ రేటు, మరణాలను గమనిస్తే మనం చాలా బెటర్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

- Advertisement -