మోడీ.. ప్రైవేట్ దోపిడీ!

26
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయినప్పటికి అదానీ, అంబానీ లకు తొత్తుగా మరారానే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ప్రబుత్వ ఆస్తులన్నింటినీ అదానీ గ్రూప్స్ చేతిలో పెట్టడం, అదానీ చేతిలో మోడీ కీలు బొమ్మగా వ్యవహరించడం గమనిస్తూనే ఉన్నాం. దేశంలో అదానీ గ్రూప్ కుంభకోణాన్ని బహిరంగంగా విదేశీ సంస్థలు బయట పెట్టినప్పటికీ.. మోడీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. ఇదిలా ఉంచితే ప్రజా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టడం వేల కోట్లు వెనకేసుకోవడం ఈ మద్య ప్రధాని మోడీకి బాగా అలవాటుగా మారిందని చెప్పక తప్పదు..

ఏపీ, తెలంగాణ, కర్నాటక.. ఇలా రాష్ట్రమేదైనా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతూ దేశాన్ని అమ్మేసేందుకు సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వ్యవహార శైలి పట్ల ఇటు ఇతర నేతల నుంచి అటు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రైవేటీకరణ విధానంపై ఇటీవల మోడీ.. తన వైఖరిని పునరుద్ఘాటించడం కొంత ఆందోళన కలిగించే విషయమే.

కొత్త ప్రభుత్వ రంగ సంస్థ విధానంలో ప్రభుత్వం కేవలం నాలుగు రంగాలకు మాత్రమే పరిమితం అవుతుందని, మిగిలిన ఇతర ప్రభుత్వ రంగ విభాగాలను ప్రైవేటీకరణ చేయవచ్చని చెప్పడంతో.. నెక్స్ట్ ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే.. ఏకంగా దేశాన్నే ప్రైవేట్ సంస్థలకు అమ్మేసేందుకు ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు రాక మానవు. దేశ ఆర్థిక వ్యవస్థ పెంచడానికే ప్రైవేట్ సంస్థలకు తమ మద్దతు అని మోడీ చెబుతున్నప్పటికీ.. దాని వెనుక భారీ కుంభకోణాలు దాగి ఉన్నాయనేది రాజకీయ అతివాదులు చెబుతున్నా మాట. ఇప్పటికే అధాని గ్రూప్స్ తో కలిసి మోడీ చేస్తున్న కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి మళ్ళీ అధికారమిస్తే.. ప్రభుత్వ ఆస్తి అంటూ ఏది లేకుండా మొత్తం ప్రైవేటీకరణ అయిన ఆశ్చర్యం లేదనే చెప్పాలి.

Also Read:భూకంపంతో నేపాల్ విలవిల..

- Advertisement -