బ్రెజిల్‌లో పెను విషాదం…81 మంది మృతి

272
- Advertisement -

బ్రెజిల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో వెళ్తున్న ఓ విమానం ప్రమాదవశాత్తూ కుప్ప కూలింది. బొలివియా నుంచి ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లను కొలంబియా తీసుకెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 81 మంది మృతిచెందారు.  సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ 81 మందిలోనే బ్రెజిల్‌ లోని చాపెకోఎన్సో ఫుట్‌ బాల్‌ అసోసియేషన్ అనే ఓ క్లబ్బుకు చెందిన ఫుట్‌ బాల్ క్రీడాకారులు ఉన్నారు.ఇంధన కొరత కారణంగానే విమానం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.

Plane ‘carrying football team from Brazil’ crashes in Colombia

చాపెకోఎన్సో ఫుట్‌ బాల్‌ అసోసియేషన్కు చెందిన ఆటగాళ్లతో మెడిలిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం బొలివియా నుంచి బయలు దేరింది. అలా బయలుదేరిన కొద్ది సమయానికే రాడార్‌ నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది కొలంబియా వద్ద కూలిపోయినట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. కోపా సుడామెరికా ఫైనల్స్లో పాల్గొనేందుకు వీరు వెళుతున్నట్లు తెలిసింది. మంగళవారం ఉదయం 10.15గంటల సమయంలో(స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

brazil plane crash brazil plane crash brazil plane crash

Plane ‘carrying football team from Brazil’ crashes in ColombiaChapecoense

- Advertisement -