తొందరపడి వ్యాక్సిన్ రిలీజ్‌చేయం:ఫార్మా కంపెనీలు

225
pharma company

కరోనా వ్యాక్సిన్‌పై పలు దేశాలు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్‌ తుదిదశకు చేరుకున్నాయి. అయితే ఇందులో ప్రఖ్యాత యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మూడో దశ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రాజెనికా. వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు కీలకనిర్ణయం తీసుకున్నాయి.

వ్యాక్సిన్‌ తయారీలో శాస్త్రీయ ప్రమాణాలకే తాము కట్టుబడి ఉంటామని అమెరికా, ఐరోపాలకు చెందిన వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు సంయుక్త ప్రకటన చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీకి ఉన్న శాస్త్రీయ ప్రక్రియ సమగ్రతకే తాము మద్దతిస్తున్నట్లు ప్రజా ప్రతిజ్ఞ చేశాయి.

ఆస్ట్రాజెనికా, ఫైజర్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, జాన్సన్‌ & జాన్సన్‌, మెర్క్&కో, మోడెర్నా, నోవావాక్స్‌, సనోఫి, బయోఎన్‌టెక్‌ మొత్తం తొమ్మిది వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు ఈ సంయుక్త ప్రకటన చేశాయి. ప్రస్తుతం 180కిపైగా వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయి.