భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌..వెనక్కి తగ్గిన ఫైజర్!

138
pfizer
- Advertisement -

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ అందిస్తుండగా దశల వారీగా ప్రజలకు టీకాలను అందజేయనున్నారు. అయితే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తొలి సంస్ధ ఫైజర్‌ వెనక్కి తగ్గింది.

డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాతో స‌మావేశ‌మైన తర్వాత ఫైజ‌ర్ భారత్‌లో వ్యాక్సినేషన్‌ కోసం చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. రెగ్యులేట‌ర్ మ‌రింత స‌మాచారం కోరింద‌ని, దీంతో ప్ర‌స్తుతానికి త‌మ ద‌ర‌ఖాస్తును ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఫైజ‌ర్ సంస్థ వెల్ల‌డించింది. వాళ్లు కోరిన అద‌న‌పు స‌మాచారంతో భ‌విష్య‌త్తులో మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసుకుంటామ‌ని చెప్పింది.

- Advertisement -