గుడ్ న్యూస్‌..ఫైజర్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అమోదం

75
pfizer

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో గుడ్ న్యూస్ తెలిపింది. ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్‌ను అత్య‌వ‌స‌రంగా వినియోగించేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఫైజ‌ర్‌-బ‌యెఎన్‌టెక్ సంస్థ రూపొందించిన క‌రోనా వైర‌స్ టీకాకు బ్రిటన్‌ , అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు అందుబాటులోకి కూడా వచ్చింది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పేద దేశాల్లోనూ ఫైజర్ టీకా అందుబాటులోకి రానుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఫైజ‌ర్ టీకా చాలా సుర‌క్షిత‌మైంది, స‌మ‌ర్థ‌వంత‌మైంద‌ని తేలిన‌ట్లు యూఎన్ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అయితే స్టోరేజ్ వ్య‌వ‌స్థ లేని పేద దేశాల‌కు ఫైజ‌ర్ టీకాను త‌ర‌లించేందుకు కావాల్సిన డెలివ‌రీ ప్లాన్స్‌ను ప్రిపేర్ చేసిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది.