ఫైజర్,మెడెర్నా టీకాలే బెస్ట్..!

184
vaccine
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో టీకాల సంఖ్యను కూడా ఆయా దేశాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అమెరికాకు చెందిన ఫైజ‌ర్‌, మెడెర్నా కోవిడ్ టీకాలు అత్యంత ప్ర‌భావంతంగా ప‌నిచేస్తున్నాయని….. ఆ టీకాల‌కు సంబంధించి తొలి డోసు తీసుకున్న రెండు వారాల్లోనే ఇన్‌ఫెక్ష‌న్ రేటు 80 శాతం త‌గ్గిన‌ట్లు ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఇక రెండ‌వ డోసు తీసుకున్న రెండు వారాల త‌ర్వాత ఇన్‌ఫెక్ష‌న్ రిస్క్ 90 శాతం త‌గ్గిన‌ట్లు ఆ స‌ర్వే చెప్పింది.

వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎంత సామ‌ర్థ్యంతో ప‌నిచేస్తుంద‌న్న కోణంలో స్ట‌డీ నిర్వ‌హించారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ‌( సీడీసీ) ఈ స‌ర్వే చేప‌ట్టింది.

- Advertisement -