మళ్లీ పెట్రో వడ్డన…

132
petrol
- Advertisement -

పెట్రోల్,డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. పెట్రోల్‌, డీజిల్‌పై మరో 35 పైసల చొప్పున పెంచగా దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.89కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.62కు పెరిగింది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.18, డీజిల్‌ రూ.104.32గా ఉండగా ముంబైలో పెట్రోల్‌ రూ.112.78, డీజిల్‌ రూ.103.36, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.45, డీజిల్‌ రూ.98.73, చెన్నైలో పెట్రోల్‌ రూ.103.92, డీజిల్‌ రూ.99.92కి చేరాయి.

- Advertisement -