ఆగని పెట్రోవాత…మళ్లీ పెరిగిన చమురు ధరలు!

151
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వినియోగదారులకు షాకిస్తూ రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండగా రోజువారి సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 28 పైసల చొప్పున పెరిగి రూ.104.87, రూ.97.96కు చేరాయి.

దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.91కి చేరగా, డీజిల్‌ ధర రూ.89.88కి పెరగగా ముంబైలో పెట్రోల్‌ రూ.106.93, డీజిల్‌ రూ.97.46, భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.24, డీజిల్‌ రూ.98.67, కోల్‌కతాలో రూ.101.01, రూ.92.97గా ఉన్నాయి.

- Advertisement -