అమెరికా మెడికేర్‌ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళా

134
meena

మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా మెడికేర్ డైరెక్టర్‌గా మీనా శేషమణిని నియమించారు. ఆరోగ్యం, మానవ సేవల సంస్థ(హెచ్‌హెచ్‌ఎస్‌) సమీక్ష బృందం సభ్యురాలిగా ఆరోగ్య నిపుణురాలు డాక్టర్‌ మీనా శేషమణిని అపాయింట్ చేశారు. బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న శేషమణి.. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుంచి ఎండీ పూర్తిచేశారు. ఇప్పటికే బైడెన్‌ జట్టులో మెజారిటీగా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్న సంగతి తెలిసిందే.