స్థిరంగా చమురు ధరలు..

90
petrol rate
- Advertisement -

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దేశీయ మార్కెట్‌లో మాత్రం చమురు ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 108.20 వద్ద ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ. 94.62గా ఉంది. ఏపీలోని గుంటూరులో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.67గా ఉండగా డీజిల్ ధర రూ. 96.08గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ధరలు 90 డాలర్ల సమీపంలోకి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.88 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 89.78 డాలర్లకు ఎగసింది.

- Advertisement -