23 అంశాలతో కేంద్రంపై ఒత్తిడి: టీఆర్ఎస్ ఎంపీలు

45
trs
- Advertisement -

రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీఆర్ఎస్ ఎంపీలతో చర్చించిన సీఎం…తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు.

రాష్ట్ర హక్కులు, రావాల్సిన నిధుల కోసం ఉభయ సభలను స్తంభింపజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి 23 అంశాలతో నివేదిక ఎంపీలకు అందించారు. బయ్యారం ఉక్కు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్శిటీ,ఐఐఎం,ఐటీఐఆర్ లాంటి హామీలు, అంశాలపై నీలదీయాలని కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. సింగరేణి కోల్ మైన్స్ బ్లాకుల ప్రైవేటీకరణ, ఎరువుల ధర పెంపు.. విద్యుత్ నియంత్రణ చట్టం.. సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో గట్టిగా నిరసన తెలుపాలని ఆదేశించారు కేసీఆర్.

- Advertisement -