12వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు….

47
petrol

వరుసగా 12వ రోజు పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరగగా ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.58, డీజిల్‌ ధర రూ.80.97గా ఉంది. కు చేరాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై 40 పైసలు పెరుగగా లీటర్‌ పెట్రోల్‌ రూ.94.18, డీజిల్‌ రూ.88.31గా ఉంది.

ముంబైలో 38 పైసలు పెరగడంతో పెట్రోల్‌ ధర రూ.97కు, డీజిల్‌పై 39 పైసలు పెరగడంతో రూ.87.06కు చేరాయి. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.67, డీజిల్‌ రూ.85.84కు చేరాయి. చెన్నై- పెట్రోల్‌ రూ.92.59, డీజిల్‌ రూ.85.98,జైపూర్‌- పెట్రోల్‌ రూ.96.69, డీజిల్‌ రూ.89.04 ధరగా ఉంది.