తొలిసారి రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధర పెంపు..!

158
Petrol price
- Advertisement -

దేశ చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 మార్క్‌ను తాకింది. నేడు రాజస్థాన్ లో ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయలు అధిగమించింది. నేడు చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో, ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. కాగా రాజస్థాన్‌లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీగంగనార్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటి 101.15కు చేరింది. సాధారణ పెట్రోల్ ధర రూ. 98.40కి చేరింది.

ఇక లీటర్‌ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.89.10గా ఉండగా.. ముంబైలో రూ.95.61గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 83.46గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. 92.51 ఉంటే, డీజిల్ ధర రూ.85.70 పలుకుతోంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.91గా ఉంటే.. డీజిల్ ధర రూ.85.09గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.76.23గా ఉంది. ముంబైలో ఇప్పటికే రూ.83 దాటింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగనార్ పట్టణంలో దాదాపు 90కి చేరింది. ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ఈ పెట్రోల్‌లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

- Advertisement -