- Advertisement -
పెట్రోల్,డీజిల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గె పరిస్థితి కనిపించడం లేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకింత చొప్పున పెంచుకుంటూ పోతుండగా, ధరలు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. శనివారం ముంబయిలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 22 పైసల చొప్పున పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై లీటర్‌కు 22పైసలు, డీజిల్‌పై 21పైసలు ఎగబాకింది.
దీంతో ముంబయిలో ఇవాళ లీటర్ పెట్రోల్ రూ.90.75, డీజిల్ రూ.79.23ను చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.88.41, డీజిల్ రూ.81.18 వద్ద ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి బలహీనతతో పెట్రోలు, డీజిల్ ధరలు ఢిల్లీ, ముంబయిలలో పలు కారణాల వల్ల విపరీతంగా పెరిగిపోయాయి.
- Advertisement -