సైనా లుక్‌లో ఒదిగిపోయిన శ్ర‌ద్ధాకపూర్..

282
Shraddha Kapoor
- Advertisement -

ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమలో చూపినా బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఆ ట్రెండ్‌లో స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం సైనా నెహ్వాల్ బయోపిక్. బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ బయోపిక్ అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతుండగా టీ-సీరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 22 న ప్రారంభం అయింది.

Shraddha Kapoor

కాగా,ఇటీవ‌ల సైనా పాత్ర‌లో శ్ర‌ద్ధాకపూర్‌ లుక్ ఒక‌టి విడుద‌ల చేసిన టీం తాజాగా మరో లుక్ రిలీజ్ చేసింది. ఇందులో ష‌టిల్ బ్యాట్ ప‌ట్టుకొని బిగ్గ‌ర‌గా అరుస్తున్న‌ట్టు ఉంది శ్ర‌ద్ధా. సైనా లుక్‌లో ఒదిగిపోయిన శ్ర‌ద్ధా క‌పూర్ లుక్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. శ్ర‌ద్ధా మ‌రోవైపు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సాహోలో ప్రభాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

- Advertisement -